జర్నలిస్టులకు హోమియోపతి మందుల పంపిణీ…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 16: కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తనవంతు సహయంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని రోగ నిరోధక శక్తి పెంచే హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్టులకు హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ హోమియోపతిలో రోగ నిరోధక శక్తిని పెంచే అర్సానిక్ ఆల్బమ్ 30, కాంఫోర్-1ఎం వంటి మందులు మంచి ఫలితాలు ఇస్తాయని వివరించారు. ముందు జాగ్రత్త చర్యలు కోసం కరోనా వారియర్స్ మున్సిపల్ కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు ఈ మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పాత వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలలో ఈ వర్గాలకు పంపిణీ చేశానని, సోమవారం నుంచి కరీంనగర్ జిల్లా లో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహా రావు, నాయకులు కార్యవర్గ సభ్యులు దాడి సంపత్ తోపాటు పలువురు జర్నలిస్టు లు పాల్గొన్నారు.