ఆసుపత్రి వద్ద కార్మికుల ఆందోళన
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 26: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యములో ఆసుపత్రి గెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు బిజెపి నేతలు మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న కార్మికులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసు వాహనానికి అడ్డంగా కార్మికులు పడుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ అక్కడికి చేరుకుని కలెక్టర్ వచ్చిన తర్వాత మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, సహాయ కార్యదర్శి ఎడ్ల రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సరళ, శారదా, కార్మికులు కల, అంజలి, కృష్ణ, అశోక్, శారదా, పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు.