నగారా మోగింది…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8, అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 13గా నిర్ణయించారు. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎన్నికల నగారా మోగడంతో హుజురాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వెడేక్కింది.