హైదరాబాద్ తరలిన తెలుగు తమ్ముళ్ళు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 26: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద టీడీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్ళిన వారిలో తెలుగుదేశం నాయకులు నాగుల బాలాగౌడ్, సందెబోయిన రాజేశం, వంచ శ్రీనివాస్ రెడ్డి, దాసరి రామకృష్ణారెడ్డి, నూజెట్టి వాణి, ఎర్రబెల్లి రవీందర్, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, బసాలత్ మహమ్మద్ ఖాన్, వేముల లక్ష్మణ్ రావు, సాయిళ్ల రాజమల్లయ్య, బాబా, ఆకుల కాంతయ్య, తీగట్ల రమేష్, జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, జుబేర్, జావీద్,మహబూబ్ ఖాన్, ఉప్పు నారాయణ, నరేందర్ దత్తు, ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు.