రేపు, ఎల్లుండి ధృవపత్రాల పరిశీలన
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల్లో భాగంగా ఇటీవల స్టయిఫండరీ సబ్ ఇన్స్పెక్టర్లుగా ( సివిల్, ఆర్మూడ్ రిజర్వ్, టి.ఎస్.పి, ఫైర్, పోలీస్ కమ్యూనికేషన్ , జైలర్, ఫింగర్ ప్రింట్ ఎ.ఎస్.ఐ) ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23, 24 తేదిల్లో ఉదయం 10 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రుద్రమదేవి హల్ నందు హాజరు కావాల్సిందిగా నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్ది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హజరయ్యే అభ్యర్థులు తమ వెంట హల్ టికేట్, ప్రోవిసినల్ సెలెక్షన్ కాపి, నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, దరఖాస్తు సమయంలో సమర్పించిన విద్యార్హత మరియు కులదృవీకరణ పత్రాలకు సంబంధించి నాలుగు జతల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు.