కరెంటు మోటార్ల దొంగలపై పిడి యాక్ట్ అమలు…
1 min read
కరీంనగర్: సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యవసాయ బావులు, కాల్వల వద్ద ఉండే కరెంటు మోటర్లు దొంగిలించడం వృత్తిగా ఎంచుకుని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ.. రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ముగ్గురు దొంగల పై కరీంనగర్ పోలీసులు బుధవారం పీడీ యాక్ట్ ను అమలు చేశారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గొల్లపల్లి మహేష్, రాయికంటి రమేష్, ముల్కల భగత్ అనే ముగ్గురిపై పీడీ యాక్ట్ ను అమలు చేశారు. ఈ ముగ్గురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ… రైతులు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతో పీడీ యాక్ట్ ను అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన మానకొండూర్ఇన్ స్పెక్టర్ సంతోష్, పిడి సెల్ ఇంచార్జి పండరి లను సిపి కమలాసన్ రెడ్డి అభినందించారు..