కారెక్కిన స్వతంత్రులు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జనవరి 28: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు దీటుగా సత్తా చాటి విజయం సాధించిన స్వతంత్రులు అధికార టీఆర్ఎస్ చెంతకు చేరారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమక్షంలో మంగళవారం టిఆర్ఎస్ లో చేరారు.
కోటగిరి భూమా గౌడ్, కొలిపాక అంజయ్య,
సుదగోని మాధవి, ఎదుల్ల రాజశేఖర్, ఆకుల నర్మద- నర్సయ్య, ఐలేందేర్ యాదవ్, లెక్కల స్వప్న-వేణుగోపాల్ తదితరులు గులాబీ కండువ కప్పుకున్నారు. ఇప్పడు టిఆర్ఎస్ సంఖ్య 40కి చేేేరింది.