పాక్ ఆపరేషన్ ను భగ్నం చేసిన భారత్….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూఢిల్లీ, ఆగస్టు 4: పుల్వామా సర్జికల్ స్ట్రైక్ తరువాత మరోసారి భారత్ సైన్యం పాకిస్తాన్ పై విరుచుకుపడింది. పాక్ పన్నాగాన్ని ముందే పసిగట్టిన భారత్ పాక్ కమాండో ఆపరేషన్ను భగ్నం చేసింది. భారత్ సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు హతమయ్యారు. మృతులు జైషే ఉగ్రవాదులు కానీ, పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు కానీ అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.