JMS News Today

For Complete News

ఇందిరానగర్ కూరగాయాల మార్కెట్ ప్రారంభం

1 min read

కరీంనగర్: రైతులను బలోపేతం చేసేందుకు వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగరంలోని 14వ డివిజన్ ఇందిరా నగర్లో ఏర్పాటు చేసిన రైతు బజార్ ను ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ నిధులు 30లక్షలతో మార్కెట్ ను నిర్మించారు. మార్కెట్ అంతా కలియ తిరిగిన ఎమ్మెల్యే… రైతులతో మాట్లాడి వారు సమస్యలను తెల్సుకున్నారు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా రైతు బజార్ కాంప్లెక్స్ ఆవరణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, కార్పోరేటర్లు లంక రవీందర్, వైద్యుల శ్రీదేవి-అంజన్ కుమార్, కంసాల శ్రీనివాస్, గొట్టిముక్కల వెంకటరమణ, సరిళ్ల ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…కరీంనగరంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్… నగరాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *