JMS News Today

For Complete News

ఆ కళాశాలదే జోరు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 18: ఇంటర్ ఫలితాల్లో ఎప్పటీలాగే అల్ఫోర్స్ విజయ పరంపర కొనసాగించి సంచలనం సృష్టించింది. గురువారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను ఆర్. కృషిత 992 మార్కులు, ఎంపీసీ విభాగంలో జి. వైష్ణవి 992 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపిసీ, బైపీసీ విభాగాల్లో అల్ఫోర్స్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. బైపీసీ విభాగంలో పి. శ్రావణి 990, సి. స్వాతిశ్రీ 990, ఇ.దీక్షిత 990 మార్కులు సాధించారు. ఎంపిసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఏడుగురు విద్యార్థులు 991 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. జి.శివాణి 991, ఎ. లక్ష్మీహరిత 991, బి. వశిష్ట 991, యు. హర్షిత 991, జి. సౌమ్య 991, జి. లక్ష్మీప్రియ 991, డి. మనోజ్ఞ 991 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను పి. వైభవ్ 984 మార్కులు సాధించి రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచాడు. సీఇసీ విభాగంలో జి. కవిత 976 మార్కులు తో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచింది. కె. సుప్రియ 973, యం. మానస 973 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను కె. నిక్షిత 467, ఎ. సాక్షిత 467, ఎస్. అంకిత 467 మార్కులతో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను మలైక 436, ఉమ్మే సల్మా 436 మార్కులతో ఉత్తమ స్థానంలో నిలిచారు. ఎంఇసీ విభాగంలో 500 మార్కులకుగాను వి. వైష్ణవి 493, హర్ ప్రీత్ కౌర్ 493 మార్కులు సాధించారు. అలాగే సిఇసి విభాగంలో కె. సంకేత 490 మార్కులు సాధించింది. పోటీ పరీక్షలతోపాటుగా ఇంటర్ (ఐపీఇ) లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో ఘన విజయం సాధించడం పట్ల ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన, అత్యుత్తమ మార్కులు సాధించిన అల్ఫోర్స్ చిన్నారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *