JMS News Today

For Complete News

దేశ రాజకీయాలకు జగన్ ఆదర్శం

1 min read

కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు . శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌ తీరును కొనియాడారు.  పార్టీ ఫిరాయింపుల విషయంలో వైఎస్ జగన్‌ను చూసైనా సీఎం కేసీఆర్ మారాలని హితవు పలికారు. ప్రతిపక్షం లేకుంటే నియంతృత్వం రాజ్యమేలుతుందని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ తీరు సరైనదికాదని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో .విద్యా హక్కు చట్టం అమలు చేయలేదని, విద్యా రంగానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *