కరోనా కాటుకు అడిషనల్ ఎస్పీ మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 26: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతి చెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం విధులు నిర్వర్తించిన దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.
వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.1989 బ్యాచ్ ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన దక్షిణా మూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సిఐ, డీఎస్పీ గా పనిచేశారు. ప్రస్తుతం జగిత్యాల ఆడిషినల్ sp గా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున పదవి విరమణ చేయనుండగా, దక్షిణామూర్తి అకాల మరణం దిగ్ర్భాంతి కి గురిచేసిందని పలువురు పోలీసు అధికారులు పేర్కొన్నారు.