ఆ వివరాలు ఆన్ లైన్ లో పొందుపర్చాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 28: జగిత్యాల పట్టణంలోని వి కె బి ఫంక్షన్ హాల్లో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో నవరాత్రి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండపం నిర్వాహకులకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారాన్ని కంప్యూటర్ నందు అప్లై చేసుకోవాలని సూచించారు. policeportal.tspolice.gov.in అనే వెబ్ సైట్ లో వివరాలు పొందుపరచాలని అన్నారు. పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపానికిి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని, ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని, ఈ అప్లికేషన్ ను ఉపయోగించే విధానం గురించి ఒక వీడియో రూపొందించడం జరిగిందని, ఆ వీడియో ద్వారా సంబంధిత వివరాలను ఏ విధంగా ఆన్లైన్లో పొందుపరచాలి అనేదానిపై ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ, సిఐలు ప్రకాష్, రాజేష్, ఎస్ఐ లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.