జగిత్యాల పురవాణి ముగిసింది
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 26: జగిత్యాల మున్సిపల్ పరిధిలో గత 18 నెలలనుంచి నిర్వహిస్తున్న పురవాణి బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తమ చివరి పురవాణి కార్యక్రమంలో చైర్ పర్సన్ టి.విజయలక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ అధికారి కిరణ్, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో కలిసి పాల్గొని, దరఖాస్తులు స్వీకరించి, వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ
జిల్లా కేంద్రంలోని జగిత్యాల మున్సిపల్ తరపున గత 18 నెలల కాలంలో పురవాణి సమస్యలు తమకు సాధ్యమైనంత వరకు పరిష్కరించామన్నారు. ఈరోజు తో మా పాలకవర్గం కాలం ముగిసింది, పట్టణం లోని ఆన్ని వార్డులకు సంబంధించి ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడం కోసం పురవాణి పేరిట ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి బుధవారం మున్సిపల్ ఆవరణలో ప్రజలనుండి ఆస్తిపన్ను, వార్డు సమస్యలు, శానిటేషన్, వీధి దీపాలు, ఆస్తి యాజమాన్య హక్కు తదితర సమస్యల దరఖాస్తులు స్వీకరించి, వీలైనంతమేర వెంటనే పరిష్కరించామని విజయలక్ష్మి పేర్కొన్నారు. పురవాణి తమకు ఎంతో సంతృప్తి నివ్వడమే గాకుండా సత్ఫలితాలనిచ్చిందనీ, అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అన్నారు ..