జైళ్ల శాఖ ఏం చేస్తుందో తెలుసా… !
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల్లో మార్పు తీసుకువస్తూ, జైలు నుంచి విడుదలైన వారికీ ఉద్యోగాలు కల్పిస్తూ, కొత్త జీవితాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం మహబూబ్నగర్లో తొలిసారి విడుదల ఖైదీల కోసం జాబ్ ఫెస్ట్ నిర్వహించగా, అక్కడ 175 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రెండోసారి కరీంనగర్లో నిర్వహించి 102 మందికి, మూడోసారి హైదరాబాద్లో, తాజాగా, నాలుగోసారి కూడా శనివారం హైదరాదాబాద్ లో నిర్వహించింది.
ఈ ఉద్యోగ మేళాలో 81 మంది విడుదల ఖైదీలకు ఉద్యోగాలొచ్చాయి. ఈ జాబ్ ఫెస్ట్ లో మొత్తం 129 మంది పాల్గొనగా, 81 మంది ఉద్యోగాలు సాధించారు. మొత్తం పది కన్సల్టెన్సీ సంస్థలు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఇంటర్వ్యూ అనంతరం 81 మందిని ఎంపిక చేశాయి. ఇప్పటికే అనేక సంస్కరణలతో ముందుకు సాగుతున్న తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల పరివర్తనలో మార్పు, వారికీ ఉద్యోగ అవకాశాలు కలిపించి కొత్త జీవితాలకు పునాదులు వేస్తుండడం పట్ల అందరి నుంచి ప్రశంశలు అందుకుంటోంది. తమకు ఉద్యోగాలు లభించినందుకు విడుదలైన ఖైదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.