అక్కడ ప్రమాదం..ఇక్కడ విషాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 30: పంజాగుట్టలోని ప్లై ఓవర్ పై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ (టీఎస్ 12 ఎఫ్ జే 4873)పై ప్రయాణిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చెందిన మహమ్మద్ తాజుద్దీన్ ప్లై ఓవర్ పై నుంచి కిందపడి మృతి చెందాడు. తాజుద్దీన్ ‘తెలంగాణ సమాచారం’ అనే వార్తా పత్రికలో పని చేస్తున్నట్టుగా అతని వద్ద లభించిన కార్డు ఆధారంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఐడీ కార్డు ఉండటంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఫ్లయ్ ఓవర్ పై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో కారు కూడా దెబ్బతింది. పోలీసులు క్రేన్ ను తీసుకు వచ్చి కారును అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.