జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 24: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా పూర్తి సహకారం అందిస్తానని సానుకూలంగా స్పందించారు. అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, బెడ్ రూములు, సంక్షేమ నిధి తదితర అంశాలపై జర్నలిస్టు నేతలు ఈ సందర్భంగా మంత్రి కి వివరించారు. మంత్రి ని కలిసిన వారిలో టీయుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు బల్మూరి విజయ సింహారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగోజు మహేంద్రా చారి, కోశాధికారి శరత్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి సందీప్, సీనియర్ జర్నలిస్ట్ గుండా రాజయ్య తదితరులు పాల్గొన్నారు.