కదంతొక్కిన జర్నలిస్టులు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 26: సమస్యల సాధన కోసం జర్నలిస్టులు కదంతొక్కారు. టీయుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నాల అనంతరం మండల తహసిల్దార్ లకు జర్నలిస్టులు వినతిపత్రాలను అందజేశారు. కరీంనగర్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడారు. స్వరాష్ట్రంలో మన బతుకులు బాగుంటాయని ఆశించి తెలంగాణ సాధనలో మనవంతుగా అనేక పోరాటాలు చేశామని, తీరా తెలంగాణ వచ్చాక మన బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్ళు గడిచిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరవేదని అన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు, హెల్త్ కార్డుల అమలు, జీవో 239 రద్దు చేయాలని శేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర, జాతీయ నాయకులు ఆంజనేయులు, ఎలగందుల రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయసింహారావు, ఈద మధుకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగోజు మహేంద్ర చారి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్, ఆంజనేయులు, జిల్లా నాయకులు షుకూర్, జగన్ మోహన్, రవీంద్ర చారి, ఇమామ్, అసద్, సందీప్, ప్రేమ్ కుమార్, రాజయ్య, రాజేందర్, ముత్యంలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.