డబ్బులడిగాడు…అడ్డంగా దోరికాడు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
వికారాబాద్, జూలై 2: రిపోర్ట్ ఇవ్వడం కోసం లంచం తీసుకుంటూ ఓ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో చోటుచేసుకుంది. జూనియర్ అసిస్టెంట్ సురేశ్ ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న షేక్ ఖాజా హుస్సేన్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే, ఖాజా హుస్సేన్ మృతికి సంబంధించిన రిపోర్టును పెన్షన్ డబ్బుల కోసం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపేందుకు జూనియర్ అసిస్టెంట్ సురేశ్ లంచం డిమాండ్ చేశాడు. ఈరోజు మృతుడి అన్న వద్ద రూ. 12,000 తీసుకుంటుండగా, సురేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.