చెరువుల్లో కాళేశ్వర జలాలు….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 27: కాళేశ్వరం నీళ్ళతో చెరువులు కలకలలాడుతున్నాయి. ఈ క్రమంలో నాగులమల్యాల కొచ్చేరువు నిండి మత్తడి దునికి అలుగులు పారుతోంది. కొచ్చేరువు మత్తడి నుండి వడివడిగా కొండాపూర్ లోని కోడిపేకుంటకు కాళేశ్వర జలాలు పరుగెడుతున్నాయి. చెరువు నిండడంతో పల్లె తల్లి పులకిస్తుంది. మత్తడిదునికి అలుగుపారడంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరుస్తుంది. పెద్దగా వర్షాలు కురవకున్నా కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండడంతో రైతులు మురిసిపోతున్నారు. మిషన్ కాకతీయతో బాగుపడ్డ చెరువులు అలుగులు పారుతున్నాయని ముఖ్యమంత్రి కేసిఆర్ ను, ఎమ్మెల్యే గంగులను రైతులు పొగడ్తలతో ముంచేస్తున్నారు, క్షేరాభిషేకాలు, జలభిషేకాలు చేస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం నీళ్లతో చెరువులు కళకళలాడుతున్నాయి.