JMS News Today

For Complete News

పెళ్లి మండపాల వద్దకే చెక్కులు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 29: కరీంనగర్ నియోజక వర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 313 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 2 లక్షల 41 వేల 980 రూపాయలు విలువచేసే చెక్కులను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు పెండ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకాన్ని రూపొందించారని అన్నారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొదటగా 50 వేలు, తదనంతరం 75 వేలు ప్రస్తుతం లక్ష రూపాయలు అందిస్తున్నామని, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదని తెలిపారు. త్వరలోనే పెండ్లి సమయంలో పెండ్లి మండపంలోనే కళ్యాణలక్ష్మీ చెక్కు అందేలా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *