ఇప్పటికీ 12సార్లు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
గంగాధర, మే 26: వారం క్రితం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధి మర్రిగడ్డ గ్రామానికి చెందిన తూడి కొమురయ్యకు రక్తం అవసరం కాగా, గోపాలరావుపేట్ గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకుడు, జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్ రక్తదానం చేశారు. కొమురయ్య ఆరోగ్య స్థితి విషమించడంతో రక్తం కావాలని సంప్రదించగానే కమలాకర్ రక్తదానం చేశారు. ఇప్పటికి కమలాకర్12సార్లు రక్తదానం చేశారు. కమలాకర్ చేస్తున్న రక్తదాన సేవలపై హర్షం వ్యక్తమవుతోంది.