వారి కదలికలపై నిఘా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 10: పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అడిషనల్ డిసిపి (పరిపాలన) జి.చంద్రమోహన్ అన్నారు. నేరాల చేదన కోసం పోటీ పడుతూ పనిచేయాలని చెప్పారు. కమీషనరేట్ కేంద్రంలో మంగళవారం క్రైమ్ బృందాలకు చెందిన పోలీసులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి చంద్రమోహన్ మాట్లడుతూ కమీషనరేట్ పరిధిలో దొంగతనాలు జరగకుండా గస్తీలను మరింత ముమ్మరం చేయడంతోపాటు పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. నేరాల చేదన ద్వారా పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు. నేరాల ఛేదన కోసం టెక్నాలజీనీ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్సపెక్టర్ శివకుమార్, ఎస్ఐ రహీం లతోపాటుగా క్రైమ్ బృందాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.