JMS News Today

For Complete News

పోస్టాఫీసులలో బ్యాంకు ఖాతాలు తెరవండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 20: సులభతరంగా లావాదేవీలు జరుపుకునేందుకు ఉపాధి హామీ కూలీలు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాలను తెరవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. బుధవారం చొప్పదండి మండలం ఆర్నకొండ, రుక్మాపూర్ గ్రామాలలోని పల్లె ప్రకృతి వనాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ డబ్బులు సక్రమంగా అందుతున్నాయా లేదా, నేరుగా మీ ఖాతాలో జమ అవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సులభతర లావాదేవీల కోసం పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాలు తెరవాలని కలెక్టర్ సూచించారు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. బ్యాంకులకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చునని అన్నారు. విద్యుత్ బిల్లులు, ఇన్సూరెన్స్, ఫోన్ రీఛార్జ్, ఆర్ డి, నెలవారి చెల్లింపులు, బ్యాంకులకు వెళ్లకుండానే చేసుకోవచ్చని అన్నారు. బ్యాంకులో ఆధార్ కార్డు జిరాక్స్, వేలిముద్రలు ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చని తెలిపారు. అనంతరం ఆర్నకొండ గ్రామపంచాయతీలో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి లబ్ధిదారునికి అకౌంట్ కార్డు అందజేశారు. అనంతరం రుక్మాపూర్ గ్రామంలో అదనపు సందర్శించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, డిఆర్ డిఓ శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, డిపిఓ వీర బుచ్చయ్య, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.