JMS News Today

For Complete News

పుకార్లు నమ్మవద్దు..ఆందోళన అసలే వద్దు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 13: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఇంతవరకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరు చేయలేదని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు.ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బందు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని, అనంతరం ప్రతి ఒక్కరికి దళిత బంధు మంజూరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల సర్వే చేసి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని, లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మవద్దని సూచించారు. దళితులందరికీ దళిత బంధు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *