JMS News Today

For Complete News

వాటిని తొలగించండి…లేకుంటే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఏప్రిల్ 7: ఏలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరళ్లను వివిధ రకాల వాహనాలకు ఏర్పాటు చేసుకున్న వాహనదారులు ఈనెల 10లోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. సైరన్లను తొలగించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సీపీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ప్రైవేటు వాహనాలకు అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్లను చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసి వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, సదరు వాహనదారులు వెంటనే తొలగించాలని తెలిపారు. ఈ నెల 11 నుండి కమిషనరేట్ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించి చట్టవిరుద్ధంగా సైరన్లను ఏర్పాటు చేయబడిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు సదరు వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *