అలా మెదిలితేనే..వాటిని తొలగిస్తాం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 20: నేర చరితులు సత్ప్రవర్తనతో మెదలాలని, అలా మెదిలే వారి హిస్టరీ సీట్లను తొలగిస్తామని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన రౌడీ, హిస్టరీ, మతపరమైన అల్లర్ల లో ఉన్న నేర చరితులతో మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వివిధ రకాల నేరాలలో చురుకుగా పాల్గొంటున్న వారి సీట్లను కొనసాగిస్తామని చెప్పారు. నేర చరిత్ర ఉన్న వారికి సమాజంలో మాయని మచ్చలాంటిదని, వీరి ప్రభావం పిల్లలపై పడి సమాజం చిన్న చూపు చూడడంతో పాటు వివాహాది, శుభకార్యాల్లో ఆటంకాలు పరిణమిస్తాయని అన్నారు. గత సంవత్సర కాలంగా పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెదులుతున్న వారి షీట్లను తొలగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా సత్ప్రవర్తనతో మెదులుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ అశోక్, నగర సిఐలు దేవారెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.