JMS News Today

For Complete News

రేపే చివరి రోజు..సద్వినియోగం చేసుకోండి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 23: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లోని అంగారక టౌన్ షిప్ (రాజీవ్ స్వగృహ) మొదటి విడత ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి శుక్రవారం చివరి రోజని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.  వి.కర్ణన్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడత 237 ఫ్లాట్లకు జూన్ 20 నుండి 24 వరకు ప్రత్యక్ష వేలం పాటల్లో గురువారం (జూన్ 23) వరకు 200 ప్లాట్లను వేలం వేయడం జరిగిందని, ప్రత్యక్ష వేలం పాటల్లో చివరి రోజు శుక్రవారం 37 ప్లాట్లకు వేలం వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యక్ష వేలం పాటలను వాసర ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఉదయం10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ వేలం పాటల్లో దరఖాస్తుదారులతోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న రాజీవ్ స్వగృహ దరఖాస్తుదారులు కూడా పాల్గొనవచ్చని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published.