JMS News Today

For Complete News

ప్రజల్లోకి పోస్టల్ పథకాలు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే కామ్)

చొప్పదండి, జూలై 20: పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖ నడుంబింగించింది. ఈ మేరకు చొప్పదండి పట్టణంలో బుధవారం పథకాలపై మేళా నిర్వహించారు, ఇందులో భాగంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన పథకం, రికరింగ్ డిపాజిట్ పథకం, సేవింగ్ పథకం, ఐపిపిబి, ఆర్పీఎల్ఐ, పిఎల్ఐ తదితర పథకాలు, ఖాతాలపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోస్టల్ శాఖలో ప్రజలకు ఉపయోగపడే పలు పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వాటిని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సునీల్, ఐపిఓ చంద్రమోహన్, చొప్పదండి ఎస్పీఎం అంజయ్య, మెయిల్ ఓవర్ సీర్ రాజు, మల్లేశం, పలువురు బీపీఎంలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.