JMS News Today

For Complete News

ఆసుపత్రిలో ఎంపీ సంజయ్ తనిఖీ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 26: ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్  వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక వైద్యశాలను ఆయన జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు వార్డులలో చికిత్స పొందుచున్న రోగులను పరామర్శించి ల్యాబ్, ఓ.పి, ఎక్స్ రే, రక్త పరీక్ష కేంద్రాలతో పాటు మందుల స్టాక్ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు మరియు సిబ్బందిని వైద్యాశాలలో వసతులు అందుబాటులో ఉన్న మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో వైద్య సిబ్బందికి సరియైన మాస్కులు లేనట్లు గుర్తించిన ఆయన సిబ్బందికి సరియైన మాస్కులు అందజేయాలని లేదంటే రోగులకు వైద్యసేవలు ఎలా అందిస్తారని నిలదీశారు. ప్రతినిత్యం వైద్య సేవల కొరకు వచ్చె రోగులకు సేవలందించే సిబ్బంది అందరికి వెంటనే మాస్కులు అందించి వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత మీ పైనే ఉందని అన్నారు. అలాగే మాస్కులు మరియు వైద్యశాలకు అత్యవసరమైన కిట్లు వెంటనే కొనుగోలు చేయాలని, వాటికి అవసరమైన నిధులు ఎం.పి. నిధుల నుండి మంజూరు చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ వైద్యపరికరాలు, మాస్కులు కొనుగోలు చేస్తే రవాణాకు ఇబ్బందికి కలుగుతుందని తెలుపగా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కు సూచించారు. అలాగే వైద్యశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయుటకు డ్రై క్లీన్ మాస్కులు అవసరమున్నవని సిబ్బంది తెలపగా వాటి కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.లు 5000/- వెంటనే ఆయన స్వంత డబ్బును అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.