ఎమ్మెల్యే కెనాల్ బాట…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 22: రైతుల కోసం ఎమ్మెల్యే గంగుల కెనాల్ బాట పట్టారు. గురువారం నాగులమల్యాల చెరువు మత్తడి నుండి బావుపేట్ చెరువు వరకు నీళ్ళు వెళ్ళే మార్గాన్ని పరిశీలన కోసం రైతులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాదయాత్ర చేపట్టారు. మొదట తమ గ్రామానికి కాళేశ్వరం నీళ్లను అందించిన ఎమ్మెల్యే గంగులకు రైతులు, గ్రామస్థులు, రైతు సమన్వయ అధ్యక్షుడు గోదల చంద్రయ్య గజమాలతో సత్కరించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొచ్చేరువు అవరణమంతా పండగ వాతావరణం నెలకొంది. అనంతరం మిడ్ మానేరు లెఫ్ట్ కెనాల్ వెంట పాదయాత్ర చేస్తూ గొలుసుకట్టు చెరువులకు నీళ్లు వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. కాల్వకు మరమ్మత్తులు చేసి, కెనాల్ లో నీళ్లు వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వరద కాలువ నిర్మాణంతో ఎండిపోయిన నాగుల మల్యాల కొత్తచెరువు మళ్లీ కాళేశ్వరం నీళ్లతో నాగుల మల్యాల కొచ్చేరువు జీవం పోసుకున్నదని అన్నారు. చెరుకు జలకళ సంతరించుకుందని, ఆయకట్టు రైతులు ఎంత సంతోషంలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వలన చెరువు ఎండిపోవడంతో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతుండచవని కానీ నేడు రైతుల కళ్ళలో కాళేశ్వరం నీళ్లు కనబడుతున్నాయని అన్నారు. కాళేశ్వరం నీటితో బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. గొలుసుకట్టు చెరువులు నింపేందుకు కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తామని, అయితే రైతులంతా సహకరించాలని కోరారు. త్వరలో మిడ్ మానేరు నుండి లోయర్ మానేర్ డ్యాంకు నీటి విడుదల చేయడం జరుగుతుందని, దానితో నగరంలో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, ఎంపీటీసీ సభ్యురాలు కొమ్ము హేమలత, మాజీ ఎంపిపి వాసాల రమేష్, కొమ్ము రవి కిరణ్, గోదల చంద్రయ్య, గోదల రంజిత్, సంపత్ రావు, తోట శ్రీపతి రావు, దావకమల మనోహర్, కడారు శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.