మోడీ కి స్వాగతం పలికిన బండి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 3: ఎంపీల అభ్యాస వర్గలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు అరుదైన ప్రత్యేక అవకాశం లభించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్లమెంటు సమావేశాల సందర్భంలో బిజెపి పార్టీ తరపున ఎన్నికైన లోక్సభ రాజ్యసభ ఎంపీలకు శని, ఆది వారాల్లో అభ్యాస వర్గ పేరుతో ఢిల్లీలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ అభ్యాస వర్గ శిక్షణ తరగతుల ప్రారంభ ఉద్ఘాటన కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికే అరుదైన అవకాశం బండి సంజయ్ కి దక్కింది. లోక్ సభ ఎన్నికల అనంతరం దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించిన బీజేపీ అదిష్టానం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచి సైద్ధాంతిక పోరాటం నిర్వహిస్తున్న సంజయ్ కి అత్యంత ప్రాముఖ్యత, గౌరవం పార్లమెంటు సభ్యుల శిక్షణ తరగతుల్లో లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతించిన అనంతరం ఎంపీ బండి సంజయ్ కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జెపి నడ్డా లను కండువా కప్పి ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలికారు. సంజయ్ కి అరుదైన గౌరవం లభించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.