వివేక్ తో సంజయ్ భేటీ
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 12: రాజకీయ అధికార మార్పులకు వేదికగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పెద్దపెల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానంద సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల బీజేపీలో చేరిన పెద్దపెల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానందను సోమవారం హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో బండి సంజయ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థితులు బలోపేతం అవుతున్న క్రమంలో బిజెపిలో వివేక్ చేరికను స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, నాయకులు మార్షల్, మంత్రి చంద్రశేఖర్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్ రావు, పుల్లెల పవన్ కుమార్, ఎన్నం ప్రకాష్, కటకం లోకేష్, ఉప్పరపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.