JMS News Today

For Complete News

బొందుగాళ్ల రాజ్యం కాదు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

న్యూ ఢిల్లీ, జూలై 24: మీరు 15 నిమిషాల గురించి గుర్తు చేస్తే…మేము సెకెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇప్పుడు నడిచేది బొందుగాళ్ల రాజ్యం కాదు..హిందువుల రాజ్యం అంటూ పేర్కొన్నారు. కరీంనగర్ లో చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై సంజయ్ ఘాటుగా స్పందించారు. బీజేపీకి ప్రజా మద్దతు ఉందని,, ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే రాజకీయ పార్టీ బిజెపి అని చెప్పారు. కరీంనగర్  లో ఎంఐఎం డిప్యూటీ మేయర్ గా ఉన్నపుడు ఎన్ని మతపరమైన అల్లర్లు జరిగాయో ప్రజలందరికీ తెలుసని, 2012 ఇండియా పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ రోజు, దుర్గామాత ఉత్సవాల సమయంలో జరిగిన అల్లర్లు కరీంనగర్ ప్రజలు నేటి మరిచిపోరని గుర్తు చేశారు. టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలో భాగమే అక్బరుద్దీన్ వ్యాఖ్యలు అంటూ పేర్కొన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒంటరిగా ఎదుర్కోలేక పోయిందని, అందుకే ఇప్పుడు మిత్ర పక్షం తో కలిసి డ్రామా మొదలు పెెట్టిందని విమర్శించారు. రెండు పార్టీలు చేసే ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ..చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ప్రజలు బుద్ధి చెపుతారని సంజయ్ జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *