థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే)
హైదరాబాద్, జూన్ 22: సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో భాజపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న యువకులు, విద్యార్థులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ వ్యవహారంలో పోలీసులు టీఆర్ఎస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదనీ, జాతీయ బీసీ కమిషన్ తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఎంపీ హెచ్చరించారు.