JMS News Today

For Complete News

కారుదే కరీంనగర్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 27: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల లెక్క తేలిపోయింది. డివిజన్లలో ఎవరు విజేతలో ఓటర్లు నిర్ణయించారు. మరోమారు కరీంనగర్‌ కార్పొరేషన్‌పై గులాబీ జెండా రెపరెపలాడింది. సోమవారం స్థానిక ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో జయకేతనం ఎగరవేసింది. నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేయర్‌ పీఠానికి అవసరమైన స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. మొత్తం 33 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇకపోతే బిజెపి తొలిసారి తన అధిక్యాన్ని పెంచుకుని పట్టు నిలుపుకొంది. రెండు స్థానాలకే పరిమితమైన బిజెపి ఈసారి 13 డివిజన్లలో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం ఆరు డివిజన్లలో గెలుపొంది మూడో స్థానంలో నిలువగా, కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరవకుండా ఘోర పరాభవం పాలైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మూడు చోట్ల, ఐదు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కరీంనగర్ కార్పోరేషన్ ను కూడా చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా, మేయర్‌ పీఠం కోసం అధికార పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. గతంలో మేయర్‌గా వ్యవహరించిన రవీందర్‌ సింగ్‌తో పాటు సునీల్‌రావు, రాజేందర్ రావు సైతం పోటీలో ఉన్నారు. అధిష్ఠానం ఎవరికి అనుకూలంగా ఉందో తెలియాలంటే ఎన్నిక వరకు వేచి చూడాల్సిందే. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో గెలుపొందిన విజేతలు వీరే.

1డివిజన్
కొలగాని శ్రీనివాస్ (బిజెపి),

2). కాశెట్టి లావణ్య (టిఆర్ఎస్),

3). డివిజన్ కంసాల శ్రీనివాస్ (టిఆర్ఎస్)

4). నుజహత్ పర్వీన్ (ఎంఐఎం)

5). జహరభాను (ఎంఐఎం)

6). కోల మాలతి (టీఆర్ఎస్)

7). ఆకుల పద్మ (టీఆర్ఎస్)

8). శారద సల్ల (టీఆర్ఎస్)

9). ఐలేందర్ యాదవ్ (ఎఐఎఫ్బీ)

10). కాసర్ల ఆనంద్ కుమార్ (బిజెపి)

11). ఆకుల నర్మద (ఎఐఎఫ్బీ)

12). తోట రాములు (టీఆర్ఎస్)

13). చొప్పరి జయశ్రీ (బిజెపి)

14). దిండిగాల మహేష్ (టీఆర్ఎస్)

15). నాగ సముద్రం జయలక్ష్మీ (బిజెపి)

16). బోనాల శ్రీకాంత్ (టీఆర్ఎస్)
17). భాగ్యలక్ష్మి కోల (టీఆర్ఎస్)

18). సుదగోని మాధవి (స్వతంత్ర)

19). ఎదుల్ల రాజశేఖర్ (స్వతంత్ర)

20). తుల రాజేశ్వరి (టీఆర్ఎస్)

21). జంగిలి సాగర్ (టీఆర్ఎస్)
22). గంట కళ్యాణి (టీఆర్ఎస్)

23). ఆర్ష కిరణ్మయి (టీఆర్ఎస్)

24). కుర్ర తిరుపతి (టీఆర్ఎస్)

25). ఎడ్ల సరిత (టీఆర్ఎస్)
26). నక్క పద్మ (బిజెపి)
27). గౌసియా బేగం (ఎంఐఎం)
28). నాంపల్లి శ్రీనివాస్ (టీఆర్ఎస్)
29). గుగ్గిలపు మంజుల (టీఆర్ఎస్)
30). నేతికుంట యాదయ్య (టీఆర్ఎస్)
31). ఎల్. స్వప్న (స్వతంత్ర)
32). మర్రి భావన (బిజెపి)
33). సునీల్ రావు (టీఆర్ఎస్)
34). షాకేరా అంజుమ్ (ఎంఐఎం)
35). చాడగొండ బుచ్చిరెడ్డి (టీఆర్ఎస్)
36). గుగ్గిళ జయశ్రీ (బిజెపి)
37). చల్ల స్వరూప రాణి (టీఆర్ఎస్)
38). కచ్చు రవి (బిజెపి)
39). కొండపల్లి సరిత (టీఆర్ఎస్)
40). కోటగిరి భూమాగౌడ్ (ఎఐఎఫ్బీ)
41). బండారి వేణు (టీఆర్ఎస్)
42). వనజారావు మేచినేని (టీఆర్ఎస్)
43). సరిళ్ల ప్రసాద్ (టీఆర్ఎస్)
44). ఎం.శ్రీలత (బిజెపి)
45). పిట్టల వినోద (టీఆర్ఎస్)
46). వంగల శ్రీదేవి (టీఆర్ఎస్)
47). షరబుద్దీన్ (ఎంఐఎం)
48). దుర్శేటి అనూప్ కుమార్ (బిజెపి)
49). కమల్ జిత్ కౌర్ (టీఆర్ఎస్)
50). కొలిపాక అంజయ్య (స్వతంత్ర)
51). రవీందర్ సింగ్ (టీఆర్ఎస్)
52). మహ్మద్ అఖిల్ (ఎంఐఎం)
53). తుల శ్రీదేవి (టీఆర్ఎస్)
54). ఇర్ఫా తహరీన్ (స్వతంత్ర)
55). పెద్దపల్లి జితేందర్ (బిజెపి)
56). వంగపల్లి రాజేందర్ రావు (టీఆర్ఎస్)
57). బండ సుమ (బిజెపి)
58). రాపర్తి విజయ (బిజెపి)
59). గందె మాధవి (టీఆర్ఎస్)
60). వాల రమణారావు (టీఆర్ఎస్) విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్ కె శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి లెక్కింపు కేంద్రం వద్ద ఉండి పర్యవేక్షించారు. మొత్తానికి కరీంనగర్ బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *