JMS News Today

For Complete News

ఇక అలాంటివి ఉండబోవు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 2: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు కలిగే ఏలాంటి చర్యలు కమీషనరేట్ పరిధిలో ఉండబోవని కరీంనగర్ నూతన పోలీసు కమీషనర్ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకుగాను హెల్మెట్ నిబంధన, డ్రంకన్ డ్రైవ్, తప్పనిసరిగా మాస్క్ ధరించడం లాంటి చర్యలను మాత్రం కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. సోమవారం టీయూడబ్ల్యూజె (ఐజెయు) కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు నూతన సీపీ సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసి యూనియన్ పక్షాన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సిపి కొద్దిసేపు జర్నలిస్టు సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. కరీంనగర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడతామని తెలిపారు. అందరి సహకారంతో కమీషనరేట్ కు మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, బల్మూరి విజయసింహరావు, కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా కోశాధికారి శరత్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, సంయుక్త కార్యదర్శులు ఎం.డి.షుకూర్, ఆసద్, సందీప్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నర్సింగోజు మహేంద్ర చారి, కార్యవర్గ సభ్యులు మధుసూదన్, శ్రీనివాస్ లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *