JMS News Today

For Complete News

సీపీ కమలాసన్ రెడ్డి బదిలీ…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 27: కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం పోలీసు కమీషనర్ సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం సీపీగా రమణ కుమార్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం కమలాసన్ రెడ్డిని డీజీపీ ఆపీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జిల్లాల విభజనలో కరీంనగర్ పోలీసు కమీషనర్ గా కమలాసన్ రెడ్డి నియమితులైన సంగతి అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *