పోరుబాటలో పోస్టల్ ఉద్యోగులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖను పైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పోస్టల్ ఉద్యోగులు పోరు బాట పట్టారు. పోస్టల్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 10న నిర్వహించే ఒకరోజు సమ్మె నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కరీంనగర్ డివిజన్ నుంచి నాయకులు హైదరాబాద్ తరలివెళ్ళారు. హైదరాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కరీంనగర్ జిల్లా పీజేసీఏ నాయకులు ఎ.రమేష్, ఎ.రాంచంద్రం, ఎస్.రఘు మోహన్, అనిల్ కుమార్, ఎం.సుధాకర్, ఎన్.శ్రీనివాస్, డి.గంగయ్య, సదయ్య, సాయిరాం, ఉదయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.