JMS News Today

For Complete News

ప్రథమ స్థానంలో…ఆ పోలీసు అధికారిణి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 25: దక్షిణాది రాష్ట్రాల ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల ఎంపికలో కరీంనగర్ పోలీసు శిక్షణ కళాశాల ఎంపిక అయింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం -2021 (పోలీస్ ఫ్లాగ్) సందర్భంగా పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ విభాగాల అధికారులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో కరీంనగర్ పోలీస్ శిక్షణ కళాశాల (పిటిసి) ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న వి. సునీత మోహన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు డిజిపి కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. వ్యాస రచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించినందుకు పిటిసి ప్రిన్సిపాల్ సునీత మోహన్ కు 20 వేల రూపాయల నగదు బహుమతి మంజూరయ్యాయి. ప్రిన్సిపాల్ వి సునీత మోహన్ 2019 నవంబర్ 7న పిటిసి ప్రిన్సిపాల్ గా పదవీ భాద్యతలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2017-2018 గాను దక్షిణాది రాష్ట్రాల ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల ఎంపికలో మొదటి సారిగా ఎంపికైంది. వ్యాస రచన పోటీల విభాగంలో పిటిసి ప్రిన్సిపాల్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి నగదు బహుమతికి ఎంపికైనందుకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ, అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, పిటిసి, కరీంషనరేట్లోని అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *