మనసున్న మారాజులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 28: కరీంనగర్ రూరల్ పోలీసులు మనసున్న మహారాజులు అనిపించుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎటువంటి పనిలేక రెక్కాడితే గాని డొక్కాడని నిరు పేద కూలి కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కరీంనగర్ మండల పరిధిలో బొమ్మకల్ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన గుడిసెలు వేసుకొని కూలి పని చేసుకుంటున్న నిరుపేద కుటుంబాలు ప్రస్తుత కరోనా దెబ్బకు కూలీ పనులు లేక పూట గడవని స్థితిలో తల్లడిల్లిపోతున్న విషయాన్ని గమనించిన రూరల్ పోలీసులు మంగళవారం వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.
30 కుటుంబాలకు దాతల సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో నూనె, కిలో ఉల్లిగడ్డలు, రెండు కిలోల ఆలుగడ్డలతో పాటు ఐదు రోజులకు సరిపడా పలు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే గుంటూరుపల్లి శివారులో ఉంటున్న మరో 20 కుటుంబాలను కూడా గుర్తించి నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ సారధి, కరీంనగర్ రూరల్ సిఐ తుల శ్రీనివాసరావు, దాతలు హనుమంతరావు, పోలీసు సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవి, లింగారెడ్డి, పరశురాం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు