ప్రారంభమైన జడ్పీ సమావేశం….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన ప్రారంభమైంది. ముందుగా జడ్పీటీసీ సభ్యులు సభకు పరిచయం చేసుకున్నారు. సమావేేేేశానికి ముందు జడ్పీ చైర్ పర్సన్ విజయ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని, రాష్ట్రం ఏర్పడ్డాక ఇది రెండో పాలకవర్గం, గతంలో నిధులు లేక నీరసించిన జడ్పీ సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు ఈసారి నిధుల కొరత ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో
పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో వెంకటమాధవ రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపాల్ రావు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఎజెండాలో పొందుపరచిన అంశాల వారీగా చర్చ కొనసాగుతోంది.