విజయ నిర్మల భౌతిక దేహానికి కేసీఆర్ నివాళి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 27: ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత ఘట్టమనేని విజయ నిర్మల భౌతిక దేహాన్ని గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి, భౌతిక దేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. విజయ నిర్మల భర్త కృష్ణ ను కేసీఆర్ ఓదార్చారు. సుమారు 20నిమిషాల పాటు అక్కడే ఉన్న కేసీఆర్ విజయ నిర్మల మరణం గురించి తెలుసుకున్నారు. ఆమె మరణం సీనీరంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.