ఓపెనా…బందా….! మందుపై ఉత్కంఠ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, మే 3: మూడో దఫా లాక్ డౌన్ పొడిగిస్తూ కొన్ని సడలింపులివ్వగా, అందులో లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన దరిమిలా కేంద్రం సూచించిన విధంగా సోమవారం నుంచి తెలంగాణలో షాపులను తెరచుకునేందుకు అనుమతించాలా? వద్దా? అన్న విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో దఫా లాక్ డౌన్ నేటితో ముగియనుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 7 వరకూ కొనసాగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈలోగా, లాక్ డౌన్ మూడో విడతను ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తూనే, వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. ఇంతవరకూ నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్న ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులు లభించాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసిన కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై చర్చించినట్లు సమాచారం నేడు మరికొందరి మనోగతాలను తెలుసుకుని, ఆపై నిఘా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కొత్త కేసుల నమోదు, మరణాలు తదితరాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో కేసీఆర్ మాట్లాడారు. మొత్తానికి ఓ వైపు మందు ప్రియులు లిక్కర్ షాపులు ఓపెన్ అవుతాయని ఆశగా ఎదురుచూస్తుండగా, మరీ కేసీఆర్ నిర్ణయం ఏలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరీ కేసీఆర్ నిర్ణయం ఏలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే మరీ.