ఇక ఆ షాపులు రెండు గంటల వరకే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 20: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దరిమిలా కరీంనగర్ జిల్లాలో కిరాణ షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి లో కిరాణ షాపుల వారికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ జిల్లా కిరాణ, వర్తక సంఘం మెజారిటీ షాపుల యజమానుల అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకే షాపులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు తరువాత షాపులు తెరిచి ఉంచే వారిపై రూ.5000 జరిమానా కూడా విధించాలని కూడా నిర్ణయించారు. సోమవారం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే కిరాణం షాపులు తెరిచి ఉంటాయని కిరాణ వర్తక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ ‘జెఎంఎస్ న్యూస్ టుడే’ ప్రతినిధికి తెలిపారు.