ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని జాతీయ యువజన అవార్డు గ్రహీత అలవాల విష్ణు అన్నారు. బాపూజీ 104వ జయంతి ని పురస్కరించుకుని శుుక్రవారం గోపాల్రావుపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు బడుగు బలహీన వర్గాల చేనేత ముద్దుబిడ్డ తెలంగాణ తొలి ఉద్యమ ధృవతార మాజీ మంత్రివర్యులు తెలంగాణ జాతిపిత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం
ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా అన్ని జిల్లా కేంద్రాలలో అయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో తన తన పదవులకు రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్నా తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా మలి దశ ఉద్యమానికి ఊపిరి పోశారని, ముఖ్యంగా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో పది రోజులు దీక్ష చేసి అందరికీ ఆలోచన కల్పించే విధంగా తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని అన్నారు. జీవితంలో బడుగుల సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు రూపకల్పనలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కొలిపాక మల్లయ్య,
జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్, 13వ వార్డు సభ్యులు అలవాల శంకర్, పద్మశాలి సంఘం నాయకులు మచ్చ లచ్చయ్య, కొలిపాక మల్లేశం, కొలిపాక లక్ష్మణ్, బుధరపు కార్తీక్, కొలిపాక రాములు, ఆడెపు శ్రీనివాస్ కొలిపాక శ్రీనివాస్, కొలిపాక లక్ష్మీనారాయణ, అలవాల మహేష్, స్వర్గం మనోజ్, మచ్చ రాజ్ కుమార్, పిస్కా మునీందర్, కొలిపాక లక్ష్మీరాజం, అలువాల ప్రేమ్ చందు తదితరులు పాల్గొన్నారు.