ఆయన మా అదుపులో లేరు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు మా అదుపులో లేరని కొత్తగూడెం ఎఏస్పీ రోహిత్ స్పష్టం చేశారు. రాఘవ అరెస్ట్ వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎఏస్పీ ఈ ప్రకటన చేశారు. ఆయన కోసం ఎడెనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. రాఘవను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించిన ఎఏస్పీ అధారాలు లభిస్తే రౌడీ షీట్ నమోదు చేస్తామని వెల్లడించారు. అలాగే గతంలోని కేసుల ఆధారంగా కూడా కేసు ధర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.