ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 24: టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల సేవ కార్యక్రమాలు చేపట్టారు. అన్న దానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కరీంనగర్ లో పలు చోట్ల కేటీఆర్ జన్మ దిన కేక్ కట్ చేేసి సంబరాలు జరుపుకున్నారు. తెెెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన వేడుుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అలాగే మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆద్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, సుడా చైర్మన్ రామకృష్ణా రావు, నాయకులు సునీల్ రావు, హరిశంకర్, రమేష్, ఎడ్ల అశోక్, సోహాన్ సింగ్, మైకేల్ శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, కలర్ సత్తన్న, ప్యాట సురేష్, ఓల్లాల శ్రీనివాస్ గౌడ్, రాకేష్ మింటు తదితరులు పాల్గొన్నారు.