JMS News Today

For Complete News

చివరి జడ్పీ భేటీలో సభ్యులకు వీడ్కోలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 3: కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యుల చివరి సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ చివరి సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఐదేళ్ల కాలంలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో వివరించారు. ఐదేళ్ళ కాలంలో చేేేేపట్టిన అభివృద్ధి వివరాలతో కూడన సావనీర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంంతరం  పాలకవర్గ సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ పాలకవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక సంస్థ చైర్మన్ రాజేశం గౌడ్, జడ్పీ సీఈవో వెంకటమాధవ రావు, జడ్పీటీసీలు, ఎంపిపి లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *