బల్దియా లో భాజపా….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 20: పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేస్తేనే మనుగడ ఉంటుందని, ఈ ఎన్నికల్లో బల్దియా లో కాషాయం జెండా ఎగురవేయాలంటే ప్రతి ఒక్కరు శ్రమించాల్సిన అవసరముందని బిజెపి నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎంపీ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఓటరుకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని నిరు పేద వర్గాలకు చేరే విధంగా ప్రతి కార్యకర్త శ్రమించాల్సిన అవసరం ఉందని, కొత్తగా ఏర్పడే డివిజన్ల అభివృద్ధి పరిచేందుకు ముందుంటామని చెప్పారు. స్మార్ట్ సిటీ లో భాగంగా శివారు కాలనీల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఎంఐఎం పార్టీ తో తెరాస పార్టీ జత కట్టి కరీంనగర్ కార్పొరేషన్ ను ఎంఐఎం చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ అభివృద్ధికి సైతం అండగా నిలవాలని కోరారు. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే భాజపా ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. టీఆర్ఎస్ మహిళా నేేత గుర్రం పద్మారెడ్డితో పాటు పలువురు బిజెపిలో చేరారు. ఈ కాార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ బాల శీను, బిజెపి జిల్లా నాయకులు కోలగాని శ్రీనివాస్, ఆరేపల్లి మహేష్, కశెట్టి శేఖర్, దాసరి రామ్మూర్తి, గాజుల స్వప్న, బండ అనిత తదితరులు పాల్గొన్నారు.